Varanasi: ‘వారణాసి’ కూడా వాయిదా పడనుందా? మహేష్ బాబు సినిమా రిలీజ్‌పై కొత్త చర్చ!

Varanasi: ‘వారణాసి’ కూడా వాయిదా పడనుందా? మహేష్ బాబు సినిమా రిలీజ్‌పై కొత్త చర్చ!

టాలీవుడ్‌లో వరుసగా భారీ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటుండటంతో ఇప్పుడు అందరి దృష్టి సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై పడింది. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్‌పై నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ‘వారణాసి’ కూడా వాయిదా పడనుందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా, తాజాగా వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి నిజంగానే ‘వారణాసి’ విడుదల తేదీలో మార్పు ఉండనుందా? ఈ ప్రచారంలో వాస్తవమెంత? అన్నది చూద్దాం..

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులే కీలకమా?

రాజమౌళి సినిమా అంటేనే భారీ విజువల్స్‌, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు గుర్తొస్తాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మహేష్ బాబుతో ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ స్థాయి, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరమవుతుందనే టాక్ నడుస్తుంది. ముఖ్యంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై నెలకొన్న అంచనాలతోపాటు ఇతర భారీ చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు ఈ చర్చకు కారణమయ్యాయి. ఒకవేళ ‘వారణాసి’ ఏప్రిల్ 7 విడుదల తేదీ నుంచి తప్పుకుంటే, ఆ తేదీని ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ దక్కించుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరి ‘వారణాసి’ విడుదల తేదీ మారుతుందా?

ప్రస్తుతం ‘వారణాసి’ రిలీజ్ డేట్ మారినట్లు మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, షూటింగ్ పురోగతి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర భారీ చిత్రాల విడుదల షెడ్యూల్స్‌లో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాల విడుదల తేదీలకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ‘వారణాసి’ వాయిదాపై ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేతప్ప, విడుదల తేదీలో మార్పు అనేది జక్కన్న కంపౌండ్ నుంచి మాత్రం వినబడట్లేదు. సో, ఇవి ఊహాగానాలు మాత్రమే అని సినీ వర్గాలు అంటున్నాయి.