దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన డిఫరెంట్ యాక్షన్ డ్రామా 'డీసీ' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. దర్శకుడుగానే కాదు తొలి చిత్రంతోనే నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తూ.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 84 కోట్లకు పైగా రాబట్టింది. త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది. లేటెస్ట్ ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.
విదేశాల నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన మహేష్ బాబు..'డీసీ'ని వీక్షించి, ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చాలా ఒరిజినల్, అద్భుతమైన సినిమా. చాలా కూల్‌గా ఉంది. ప్రతి అంశాన్ని ఆస్వాదించాను. చిత్రబృందం మొత్తానికి అభినందనలు అంటూ ప్రశంసించారు. మహేశ్ మాటలు సినిమాకు మరోసారి భారీగా ప్రచారం తెచ్చిపెట్టాయి.
దీంతో మహేష్ ట్వీట్‌ను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ రీషేర్ చేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సూపర్‌స్టార్ సినిమాను చూసి అభినందించడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. దీంతో 'డీసీ' టీమ్ ఆనందంలో మునిగిపోయింది. ఈ మూవీలో లోకేశ్ కనగరాజ్ సరసన వామికా గబ్బి మెప్పించింది.
#DC… what an original and outstanding film 👏🏻👏🏻👏🏻 Just too cool… 😎😎😎 Loved every bit of it!! Congrats to the entire team…🤗🤗❤️❤️@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP @editor_prasanna @skannanartdir @sunpictures
— Mahesh Babu (@urstrulyMahesh) August 16, 2026
ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కథ, మేకింగ్, యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా దర్శకుడిగా సంచలన విజయాలు అందుకున్న లోకేశ్.. నటుడిగా ఎలా మెప్పించాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదటి నుంచే ఉంది. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు మార్కెట్‌లోనూ సినిమాకు మంచి స్పందన కొనసాగుతుండటంతో.. రానున్న రోజుల్లో 'డీసీ' వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది..
