సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ సౌత్ కొరియన్ గర్ల్‌ఫ్రెండ్ హయిన్ కిమ్ (జిన్నీ)తో ఇటలీలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా నమ్రత కొత్త జంటకు బెస్ట్ విషెస్ చెబుతూ గుడ్ న్యూస్ పంచుకుంది. ‘‘సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ అందమైన జంట సిద్ధార్థ్, హయిన్‌కు శుభాకాంక్షలు. మీ ఇద్దరి జీవితం ప్రేమ, ఆనందం, అందమైన జ్ఞాపకాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. మీ కొత్త జీవితం మీరు కలలు కన్న దానికంటే మరింత అద్భుతంగా ఉండాలి’’ అని నమ్రత రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్, సినీ స్టార్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సిద్ధార్థ్ గల్లా?
సిద్ధార్థ్ గల్లా.. మహేశ్ బాబు మేనల్లుడు. గల్లా జయదేవ్ చిన్న కుమారుడు. సిద్దార్ద్ అన్న ‘అశోక్ గల్లా’.. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ‘హీరో’, ‘దేవకీ వాసుదేవ నందన’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘వీసా..వింటారా సరదాగా’ మూవీలో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ మాత్రం సినిమా రంగానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. కార్పొరేట్ రంగంలో తన కెరీర్‌ను ఎంచుకుని వ్యాపార వ్యవహారాల్లో కొనసాగుతున్నారు.
►ALSO READ | బాక్సాఫీస్ వద్ద అఖిల్ 'లెనిన్' కలెక్షన్ల వర్షం.. 3 రోజుల్లోనే రూ. 61.1 కోట్లకుపై వసూళ్లు!
