మహేష్ బాబు చేతులమీదుగా ఆది సినిమా టీజర్

మహేష్ బాబు చేతులమీదుగా ఆది సినిమా టీజర్

సాయి కిరణ్ అడవి డైరెక్షన్ లో ఆది హీరోగా నటిస్తున్న సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఈ మూవీ టీజర్ ను శివరాత్రి సందర్భంగా ఇవాళ రిలీజ్ చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది.  ‘నువ్వు చేసిన తప్పు వల్ల కొన్ని ప్రాణాలు పోయాయి’ అంటూ పై అధికారి ఆదిని తిడుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ‘కశ్మీర్‌ పాకిస్థాన్‌ది.. వెంటనే వదిలేసి వెళ్లిపోండి’ అంటూ ఉగ్రవాదులు ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న సీన్స్  చూపించారు. చివర్లో ‘ఓ భారతీయుడు ఎప్పుడూ ఇచ్చిన మాటను తప్పడు’ అని ఆది చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌ గా  ఉంది. NSG (నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆది నటించాడు. సాషా చెత్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యానరేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.