అంకురా పిల్లల ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

అంకురా పిల్లల ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ సిటీలోని గుడి మల్కాపూర్ లో ఉన్న అంకురా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం. 2023, డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో.. ఐదు అంతస్తుల ఆస్పత్రి భవనంలోని.. టెర్రస్ పై మంటలు ప్రారంభం అయ్యాయి. టపాసులు పేలినట్లు టెర్రస్ పై మంటలు ఎగిసిపడ్డాయి. అదుపు చేసేందుకు ఆలస్యం కావటంతో.. ఆస్పత్రి మొత్తం మంటల్లో చిక్కుకుంది.

ఐదు అంతస్తుల్లోని బిల్డింగ్ మొత్తానికి మంటలు వ్యాపిస్తుండటంతో.. రోగులు అందరినీ బయటకు తరలించారు. ఆస్పత్రి సిబ్బందితోపాటు స్థానికుల సాయంతో.. రోగులను బయటకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో చుట్టుపక్కల భవనాల్లోని వారు సైతం ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్ కు చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు అంతకు అంత భారీగా ఎగిసి పడుతుండటంతో.. ఫైర్ సిబ్బంది కష్టంగా మారింది. 

ప్రమాదం ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది అనేది స్పష్టత రాలేదు.. ఎవరైనా గాయపడ్డారా.. చనిపోయారా అనే విషయాలను అధికారికంగా ప్రకటించలేదు..