చెప్పిన డేట్కే ఊరు పేరు భైరవకోన.. వెనక్కు తగ్గని మేకర్స్

చెప్పిన డేట్కే ఊరు పేరు భైరవకోన.. వెనక్కు తగ్గని మేకర్స్

సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా రూపొందుతున్న ఫాంటసీ అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavkona). విఐ ఆనంద్(VI Anand) దర్శకత్వం వహిస్తున్నాడు. కావ్య థాపర్(Kavya thapar), వర్ష బొల్లమ్మ(Kavya Bollama) హీరోయిన్స్. అనిల్ సుంకర(Anil Sunkara) సమర్పణలో రాజేష్​ దండా(Rajesh Danda) నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాంగ్స్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  బుధవారం ఈ చిత్రానికి సంబంధించి అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.  నిజానికి డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఈ రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు.

అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘ఈగల్‌‌‌‌‌‌‌‌’ సినిమా  ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ అయ్యేలా ప్రయత్నిస్తామని ఇటీవల సినీ పెద్దలు ప్రకటించారు. దీంతో అదే రోజు  రావాల్సిన ‘ఊరు పేరు భైరవకోన’ వాయిదా పడనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో తమ సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మార్పు లేదంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇక అదే డేట్‌‌‌‌‌‌‌‌కి రజినీకాంత్‌‌‌‌‌‌‌‌ ‘లాల్ సలామ్‌‌‌‌‌‌‌‌’ విడుదలవుతుండగా, ముందురోజు ‘యాత్ర 2’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.