రాబిన్‌‌‌‌హుడ్ మున్నార్‌‌‌‌ షెడ్యూల్ పూర్తి

రాబిన్‌‌‌‌హుడ్ మున్నార్‌‌‌‌ షెడ్యూల్ పూర్తి

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌‌‌‌హుడ్’.  ఇటీవల మొదలైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మున్నార్ షెడ్యూల్‌‌‌‌ పూర్తయినట్టు తెలియజేశారు మేకర్స్. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు చెప్పారు.  టాకీ పార్ట్‌‌‌‌తో పాటు  నితిన్, ఇతర నటీనటులపై భారీ యాక్షన్ బ్లాక్‌‌‌‌ను కూడా షూట్ చేశామన్నారు.  

త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే విడుదలైన  టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో నితిన్ సరికొత్త పాత్రలో ట్రెండీ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.