
అతనొక సీక్రెట్ ఏజెంట్. సైలెంట్‌గా హ్యాండిల్ చేయాల్సిన కేసును వయలెంట్‌గా హ్యాండిల్ చేయడం అతని నైజం. సీరియస్ ఆపరేషన్‌ను కూడా కామెడీగా మార్చేస్తాడు. అతడిని అందరూ ‘ఏజెంట్ 111’ అని పిలుస్తారు. కానీ తనను తాను ‘చారి.. బ్రహ్మచారి’ అంటూ ‘బాండ్.. జేమ్స్ బాండ్’ రేంజ్‌లో పరిచయం చేసుకుంటాడు. ‘వెన్నెల కిషోర్’ హీరోగా తెరకెక్కుతున్న ‘చారి 111’లో తన క్యారెక్టర్ ఇది. సోమవారం విడుదల చేసిన ట్రైలర్‌లో తన పాత్రను పరిచయం చేశారు.
మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి చెందిన చారి ఎలా అడ్డుకున్నాడు. ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని తన బాస్ మురళీ శర్మ ఎందుకు తిట్టారు..? అనేది ట్రైలర్‌లో ఆసక్తి రేపుతోంది. టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అదితి సోనీ నిర్మిస్తున్నారు. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి ఇతర పాత్రలు పోషించారు. మార్చి 1న సినిమా విడుదల కానుంది.