హను-మాన్ మూవీ ట్రైలర్ టైమ్ ఫిక్స్

హను-మాన్ మూవీ ట్రైలర్ టైమ్ ఫిక్స్

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న  సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, పాటలు విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.  ఈ నెల 19న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు.  

ఈ  సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తున్నాడు తేజ. అతని వెనుక భారీ హనుమాన్ విగ్రహం ఉంది. అంజనాద్రి ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్న ఈ ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు  హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్,  జపనీస్‌‌‌‌‌‌‌‌ సహా పలు విదేశీ భాషల్లోనూ విడుదల కానుంది.