మిస్‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌ వెబ్ సిరీస్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ విడుదల

మిస్‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌ వెబ్ సిరీస్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ విడుదల

హీరో వరుణ్‌‌‌‌ తేజ్‌‌‌‌తో వివాహం తర్వాత పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌కు సమయాన్ని కేటాయిం చిన లావణ్య త్రిపాఠి.. తిరిగి బ్యాక్‌‌‌‌ టు వర్క్ అంటోంది. తను లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తున వెబ్ సిరీస్‌‌‌‌ హాట్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్‌‌‌‌కు రెడీ అవుతోంది. ‘మిస్‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌’ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో లావణ్యతో పాటు అభిజిత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. బుధవారం ఫస్ట్‌‌‌‌ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘ఇదొక యూనిక్‌‌‌‌ స్టోరీ. జీవితంలో అనుకోకుండా ఏర్పరచుకునే కొన్ని కనెక్షన్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయి అనే కథతో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించాం’ అని మేకర్స్ చెబుతున్నారు.