పొట్టేల్‌‌‌‌ మూవీ నుండి రెండో పాట విడుదల

పొట్టేల్‌‌‌‌ మూవీ నుండి రెండో పాట విడుదల

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్ఖురి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొట్టేల్‌‌‌‌’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్‌‌‌‌కు మంచి ఆదరణ దక్కగా.. తాజాగా గురువారం రెండో పాటను విడుదల చేశారు మేకర్స్.  శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఈ మెలోడియస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను రాహుల్ సిప్లిగంజ్  పాడిన విధానం ఇంప్రెస్ చేసింది.  

‘అరె వవ్వారె.. వారెవవ్వా.. మెల్లంగ పొద్దిడిసే.. పోయిలోన పన్న పిల్లి లేవకపాయే.. అరె వవ్వారె.. పచ్చ పచ్చగా మెరిసేటి నా ఊరే.. సచ్చినోడు బతికిపోయినాడు.. బతికినోడు ఈడ సస్తాండు.. అరె పొద్దుగాల లేస్తే చాలు ఏదో చిక్కు.. ముద్ద లేకపోతే ఏది మన్ను బుక్కు’   అంటూ కాసర్ల శ్యామ్‌‌‌‌ క్యాచీ లిరిక్స్ రాశాడు. ఈ పాటలో హీరో యువ చంద్ర క్యారెక్టరైజేషన్‌‌‌‌ను చూపించారు.  అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సేన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.