శశివదనే మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ విడుదల

శశివదనే మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ విడుదల

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శశివదనే’.  అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు.  గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను బుధవారం విడుదల చేశా రు. 

గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదని టీజర్‌‌‌‌‌‌‌‌లో చూపించారు. హీరోహీరోయిన్స్‌‌‌‌ మద్య వచ్చే లవ్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.  ప్రేమకథ మాత్రమే కాకుండా ఊహించని ట్విస్ట్‌‌‌‌ ఉండబోతోందని అర్థమవుతోంది. ట్రైలర్‌‌‌‌‌‌‌‌, సినిమా రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.