భూతద్దం భాస్కర్‌‌‌‌‌‌‌‌ నారాయణ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

భూతద్దం భాస్కర్‌‌‌‌‌‌‌‌ నారాయణ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న డిటెక్టివ్‌‌‌‌‌‌‌‌ కామెడీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ‘భూతద్దం భాస్కర్‌‌‌‌‌‌‌‌ నారాయణ’.  పురుషోత్తం రాజ్ దర్శకుడు. స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘సూటు బూటు అక్కర్లేని డిటెక్టివ్ వీడు.. జాగ్రత్త భయ్యా ఓరయ్యా.. నేరాలు చేశాక మడతేనయ్యా.. కేస్ ఏదైనా.. ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఏదైనా చూపే పడితే మటాషే.. ’ అంటూ పాటలో హీరో క్యారెక్టరైజేషన్‌‌‌‌‌‌‌‌ను వివరించారు. 

శ్రీచరణ్ పాకాల ట్యూన్ చేసి, పాడిన ఈ పాట క్యాచీగా ఉంది. పురోషోత్తం రాజ్, సురేష్ బనిశెట్టి కలిసి లిరిక్స్ రాశారు.  విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  అరుణ్, దేవి ప్రసాద్, షఫీ, శివన్నారాయణ, కల్పలత  కీలక పాత్రలు పోషిస్తున్నారు.