కల్కి నుంచి అమితాబ్‌ లుక్‌ రివీల్.. ఆసక్తిరేపుతున్న సాధువు గెటప్

కల్కి నుంచి అమితాబ్‌ లుక్‌ రివీల్.. ఆసక్తిరేపుతున్న సాధువు గెటప్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) టైటిల్‌ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్‌ అండ్ స్కైఫై కథాంశంతో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌(Nag ashwin) తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియోకు ఆడియన్స్ నుండి.. మరీ ముఖ్యంగా  ప్రభాస్ ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై కనీ వినీ ఎరుగని స్థాయి గ్రాఫిక్స్ తో రానున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

ఇక తాజాగా బిగ్ బీ పుట్టినరోజు(అక్టోబర్ 11) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కల్కి నుండి అమితాబ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సాధువు గెటప్‌ ఉన్న అమితాబ్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అమితాబ్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక కల్కి 2898 సినిమా విషయానికి వస్తే.. అమితాబ్, కమల్ హాసన్ లాంటి లెజెండ్ యాక్టర్స్ ఈ సినిమాలో కీ రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, దిశా పటాని ఫీమేల్ లీడ్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమా 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.