చాకలి ఐలమ్మగా..హీరోయిన్ ఇంద్రజ

చాకలి ఐలమ్మగా..హీరోయిన్ ఇంద్రజ

ఓ వైపు టీవీ షోస్, మరోవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పటికీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు సీనియర్  హీరోయిన్ ఇంద్రజ. ఆమె కీలక పాత్ర పోషిస్తున్న చిత్రాల్లో ‘రజాకార్’ ఒకటి.  యాటా స‌‌‌‌త్యనారాయ‌‌‌‌ణ ద‌‌‌‌ర్శక‌‌‌‌త్వంలో గూడూరు నారాయ‌‌‌‌ణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో చాకలి ఐలమ్మ పాత్రలో ఇంద్రజ కనిపించనున్నట్టు రివీల్ చేశారు మేకర్స్. 

ఇందులో రెండు చేతులతో కొడవళ్లు పట్టుకుని సీరియస్‌‌‌‌గా ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఆమె కనిపిస్తున్నారు.   రజాకార్ల చరిత్ర అందరికీ తెలియజేసేలా రూపొందించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ‌‌‌‌, అనసూయ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 15న సినిమా విడుదలవుతోంది.