ప్లాప్ హీరో.. కొత్త దర్శకుడు.. రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?

ప్లాప్ హీరో.. కొత్త దర్శకుడు.. రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akkineni Akhil) టైమ్ అస్సలు బాలేదు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో.. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో అఖిల్ అక్కినేని అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. సినిమా రిలీజై ఆర్ నెలలు గడుస్తున్నా తన తరువాతి సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు అఖిల్. ఇక ఏజెంట్ మూవీ కూడా ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఆ సినిమాను తీసుకోవడానికి ఓటీటీలు కూడా వెనుకడుగేస్తున్నాయని సమాచారం. 

ఇదిలా ఉంటే.. అఖిల్ తరువాతి సినిమాపై ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ కుర్రహీరో తన నెక్స్ట్ సినిమా కోసం ఒక కొత్త దర్శకుడు అనిల్ కుమార్ కు అవకాశం ఇస్తున్నాడట. అదికూడా రూ.100 కోట్లతో తెరకెక్కనున్న భారీ సినిమా కోసం. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అఖిల్ ఉన్న సిచువేషన్ కు రూ.100 కోట్ల భారీ సినిమా అవసరమా? రేంజ్ కు ముంచి ఖర్చు చేయడం ఎందుకు? తరువాత బాధపడటం ఎందుకు? మరో ఏజెంట్ లా మిగిలిపోవడానికా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి భారీ బడ్జెట్ తో వస్తున్న అఖిల్ ఈసారైనా హిట్టు కొడతాడా? లేదా? అనేది చూడాలి.

Also Read :- వార్ 2లో ఎన్టీఆర్ హీరోయిన్గా శార్వరి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ?