స్వయంభూ మూవీ షూటింగ్ షురూ

స్వయంభూ మూవీ షూటింగ్ షురూ

నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్‌‌లో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త మీనన్ హీరోయిన్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌పై  భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌ను ఈరోజు నుంచి మొదలుపెట్టనున్నారు. దీనికోసం  హైదరాబాద్‌‌లోని జాన్వాడ దగ్గర భారీ సెట్‌‌ను నిర్మించారు. 

ఈ ఫస్ట్ షెడ్యూల్‌‌లో నిఖిల్‌‌తో పాటు ఇతర నటీనటులంతా పాల్గొంటున్నారు. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిఖిల్ కెరీర్‌‌‌‌లో ఇది 20వ చిత్రం. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్‌‌‌‌లో వారియర్‌‌‌‌ గెటప్‌‌లో గుర్రపు స్వారీ చేస్తూ డ్రాగన్‌‌పై బాణం వేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు నిఖిల్. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ రాస్తున్నారు.