మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌లో శ్రీకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. వాసుకి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి స్కూల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో దర్శకుడు శ్రీకర్ మాట్లాడుతూ ‘మా మూవీ నుంచి వస్తోన్న ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆట సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. సింజిత్ మ్యూజిక్, కిట్టు రాసిన లిరిక్స్, విశ్వదత్తా పాడిన తీరు ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు.
ఈ సాంగ్ తమ ఏజ్ గ్రూప్ వాళ్లందరికీ నచ్చుతుందని మాస్టర్ అరుణ్ అన్నాడు. ఈ ప్రాజెక్టులో భాగమవడం చాలా ఆనందంగా ఉందని వాసుకి చెప్పారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘స్కూల్ సాంగ్‌కు పిల్లలంతా మంచి పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. నేను స్టార్స్‌తో సినిమాలు ప్రొడ్యూస్ చేశా. కానీ పిల్లలతో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ సంతోషం, సంతృప్తి కలిగాయి’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
