ఫ్యాన్​వార్లో హీరోయిన్ మాళవిక.. ప్రభాస్​కే ఓటేసిన బ్యూటీ

ఫ్యాన్​వార్లో హీరోయిన్ మాళవిక.. ప్రభాస్​కే ఓటేసిన బ్యూటీ

కోలీవుడ్​బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan)​ను ఇద్దరు హీరోల అభిమానులు చిక్కుల్లో పడేశారు. ఇటీవల సోషల్​ మీడియాలో ఫ్యాన్స్​తో ఆమె ముచ్చటించింది.

ఈ సందర్భంగా షారుక్ ఖాన్(Sharukh Khan)​ డున్కీ, ప్రభాస్(Prabhas)​ సలార్​ సినిమాల్లో దేన్ని ఎంచుకుంటారని ఆమెను ప్రశ్నించారు. దీంతో ఇరుకున పడ్డ మాళవిక ఆఖరికి తన చాయిస్​ ప్రభాస్​ నటించిన సలార్​ సినిమానే అని కుండబద్దలు కొట్టేసింది. డున్కి, సలార్​ రెండూ తనకు ఇష్టమేనని చెప్పిన ఈ బ్యూటీ.. సలార్​ టీజర్​ మాత్రం తనను ఆకట్టుకుందని చెప్పింది.

సలార్​ మూవీ చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్​గా ఎదురుచూస్తున్నట్టు చెప్పకొచ్చింది. టీజర్​లో ప్రభాస్​, పృథ్వీ రాజ్​ల లుక్స్​ అదిరిపోయాయని తెలిపింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ను ఒక్క మాటతో బుట్టలో పడేసింది. సూపర్ మాళవిక..నీకు ఇండస్ట్రీలో తిరుగుండదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్​లో వస్తున్న సలార్​, డున్కి డిసెంబర్​ 22న థియేటర్లలో పోటీపడనున్నాయి. 

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న కామెడీ,హారర్ మూవీ రాజా డీలక్స్ లో మాళవిక మెహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో తన కెరీర్ పీక్స్ లో మారిపోతుందంటూ ఫుల్ ఖుషీలో ఉంది ఈ అమ్మడు.