విమానంలో నటికి వేధింపులు.. అసభ్యంగా తాకిన వ్యక్తి

విమానంలో నటికి వేధింపులు.. అసభ్యంగా తాకిన వ్యక్తి

ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభ(Divya prabha)కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణిస్తున్న విమానాల్లో తోటి ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించాడట. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు పెట్టింది దివ్య ప్రభ.

ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ లో ముంబై నుంచి కొచ్చికి ప్రయాణిస్తున్న సమయంలో నేనొక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి నన్ను వేధించాడు. నన్ను అసభ్యంగా తాకుతూ వికృతంగా ప్రవర్తించాడు. దీనిపై ఎయిర్‌ హోస్టెస్‌ చెప్పగా వారు తీసుకున్న చర్య ఏంటంటే నా సీటు మార్పించడం. అది కూడా టేకాఫ్‌కు ముందు. కొచ్చికి చేరుకున్నాక అక్కడి విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్‌ అధికారులకు తెలిపగా.. వారు నన్ను పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు. ఈ ఘటనపై నేను కేరళ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాను. ఈ విషయమై త్వరగా దర్యాప్తు జరపాలని వారిని కోరుకుంటున్నాను.. అంటూ రాసుకొచ్చారు నటి దివ్య.  ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.