Lakshmika Sajeevan: 24 ఏళ్ల హీరోయిన్..షూటింగ్లో గుండె ఆగిపోయింది

Lakshmika Sajeevan: 24 ఏళ్ల హీరోయిన్..షూటింగ్లో గుండె ఆగిపోయింది

గుండెపోటు..ఈ మధ్య చాలామందికి వస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువతీ యువకులకు ఎక్కువగా గుండెపోటు వస్తోంది. ఇది ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో తెలియడం లేదు. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి మాత్రమే గుండెజబ్బులు, గుండెపోటు వచ్చేది. ఇప్పుడు ముప్పై ఏళ్ళ లోపు ఉన్న ప్రతి ఒక్కరికీ వస్తోంది.

లేటెస్ట్ గా మలయాళ యువ నటి లక్ష్మిక సజీవన్ ( Lakshmika Sajeevan) (24) గుండెపోటుతో మృతి చెందింది. ప్రస్తుతం యూఏఈ లోని షార్జాలో ఆమె మృతి చెందింది. ఈ 24 ఏళ్ల హీరోయిన్ షూటింగ్లో గుండె ఆగిపోయినట్లు సమాచారం. ఇంత చిన్న వయస్సులో యంగ్ హీరోయిన్ చనిపోవడంతో కేరళ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. లక్ష్మిక మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. 

అజు అజీష్ డైరెక్ట్ చేసిన 'కాక్క' షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష‍్మిక..ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. శారీరక వైకల్యాలతో అవహేళనకు గురైన అట్టడుగు ప్రజల బతుకు కథే ఈ కక్కా.రీసెంట్ గా లక్ష్మిక ఉయిరే, దుల్కర్ సల్మాన్ సౌదీ వెల్లక్క, ఒరు యామందం ప్రేమకథ, పంచవర్ణతథా తో పాటు పలు మూవీస్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. 

లక్ష్మిక తనకు వచ్చిన చిన్న చిన్న పాత్రలతో..కెరీర్ మొదలు పెట్టి..మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో.. లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి చెందడం..అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఆమె మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఫ్రెండ్స్  సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తున్నారు.