మాలే / ఇస్లామాబాద్: మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు అక్టోబర్ 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు పాకిస్తాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్‌తోపాటు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో భేటీ అయ్యారు. ఇస్లామాబాద్‌లోని ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్‌ను కూడా అందుకున్నారు.
రక్షణ, సముద్ర భద్రత, చట్ట అమలు (లా ఎన్‌ఫోర్స్‌మెంట్), పౌర విమానయానం (సివిల్ ఏవియేషన్), ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మత్స్య సంపద, పర్యాటకం తదితర రంగాలపై ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సార్క్ కూటమి ఎంతో కీలకమని, దానిని తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ముయిజ్జు తెలిపారు.చర్చల్లో సింధు జలాల ఒప్పందం గురించి షరీఫ్ లేవనెత్తినప్పటికీ ముయిజ్జు పాక్ వాదనను సమర్థించలేదు.
