Mamitha baiju: బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. ఏకంగా ఎన్టీఆర్తో

Mamitha baiju: బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. ఏకంగా ఎన్టీఆర్తో

ప్రేమలు(Premalu) సినిమాతో ఒక్కసారిగా ట్రెండ్ అయ్యరు నటి మమిత బైజు(Mamitha Baiju). మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఆమె ప్రేమలు సినిమాలో తన అద్భుతమైన నటనతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్నారు. అంతేకాదు.. చాలా మంది అబ్బాయిలకి లేటెస్ట్ క్రష్ గా కూడా మారిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. దీంతో ఆమె క్రేజ్ ను వాడేసుకోవడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇక కొత్త టాలెంట్  యూ ఎంకరేజ్ చేయడంతో మనవాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు కదా. దాంతో మమితకు తెలుగు నుండి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట. కానీ, చాలా సెలెక్టెడ్ గా సినిమాలను ఒకే చేస్తుందట ఈ బ్యూటీ.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్ దక్కించుకుందట మమిత. అది కూడా మాస్ హీరో ఎన్టీఆర్(Ntr) తో. అవును ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2(War2) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా చేస్తున్నారనడంతో వార్ 2పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీ కోసం మేకర్స్ చాలా ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు మమిత కూడా చేరిపోయిందని సమాచారం. అవును ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా మమిత కోసం ట్రై చేస్తున్నారట. 

ఇటీవల ఇంటర్వ్యూలో మమిత కూడా తాను ఎన్టీఆర్ కుక్ చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు ప్రేమలు దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడం కూడా ప్లస్ అవుతుంది. కాబట్టి.. వార్ 2లో ఎన్టీఆర్ కు జోడీగా ఆమె తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. మమిత ఎన్టీఆర్ అంటే అభిమానం అని చెప్పారుకాబట్టి ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు కానీ, ఇందులో నిజం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.