మమితా బైజు పెళ్లిపై నిర్ణయం అన్నయ్యదేనా? ఒక్క స్టిక్కర్‌తో హీరోయిన్ ఫన్నీ రియాక్షన్!

మమితా బైజు పెళ్లిపై నిర్ణయం అన్నయ్యదేనా?  ఒక్క స్టిక్కర్‌తో హీరోయిన్ ఫన్నీ రియాక్షన్!

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మమితా బైజు గుర్తింపు తెచ్చుకున్నారు.  'ప్రేమలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయింది. తమిళం, మలయాళంతో పాటు తెలుగులోనూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అయితే లేటెస్ట్ గా ఈ బ్యూటీ పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగో ప్రచారం జరుగుతోంది. అయితేఈ పుకార్లకు మమిత ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

పెళ్లి నిర్ణయం అన్నయ్యదేనా?

మమితా బైజు జీవితంలో తీసుకునే ప్రతి కీలక నిర్ణయాన్ని ఆమె సోదరుడు మిథున్ బైజునే తీసుకుంటాడంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానిని ఆమె సోదరుడు మిథున్ బైజునే నిర్ణయిస్తాడు. తనకు వచ్చే లవ్ ప్రపోజల్స్‌ను కూడా అతడే హ్యాండిల్ చేస్తాడు అంటూ కొన్ని పోస్ట్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.

ఈ పోస్టులపై స్పందించిన మమిత.. పెద్ద వివరణ ఇవ్వకుండా ఒక్క స్టిక్కర్‌తోనే తన రియాక్షన్‌ను తెలియజేసింది.  వాట్‌? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న మినియన్ స్టిక్కర్‌ను కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మమిత, ఇలాంటి ఫన్నీ రూమర్స్‌ను కూడా తనదైన శైలిలో తిప్పికొడుతూ అభిమానులను అలరిస్తోంది.

►ALSO READ | Suhas: కొన్ని ప్రేమకథలు రాయబడవు.. నేయబడతాయి.. మనసు దోచేలా సుహాస్ కొత్త సినిమా గ్లింప్స్

చేతినిండా సినిమాలు..

'ప్రేమలు'తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమిత.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్', విజయ్ 'జన నాయగన్' వంటి సినిమాలలో అలరించింది.. ప్రస్తుతం తమిళ చిత్రం 'ఇరండు వానం'లోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న 'జై హనుమాన్‌'లో ఆమెకు అవకాశం దక్కిందనే ప్రచారం కూడా వినిపిస్తోంది.