వరుస ఆఫర్స్‌‌తో దూసుకెళుతున్న ‘ప్రేమలు’ బ్యూటీ.. ‘డ్యూడ్’ సినిమాలో కురళ్‌‌గా..

వరుస ఆఫర్స్‌‌తో దూసుకెళుతున్న ‘ప్రేమలు’ బ్యూటీ.. ‘డ్యూడ్’ సినిమాలో కురళ్‌‌గా..

‘ప్రేమలు’ చిత్రంతో యూత్‌‌ను ఆకట్టుకున్న మమిత బైజూ వరుస ఆఫర్స్‌‌తో దూసుకెళ్తోంది. ఆదివారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రాల నుంచి ఆయా మూవీ మేకర్స్ బర్త్‌‌డే విషెస్‌‌తో కొత్త అప్‌‌డేట్స్‌‌ను అందించారు. ప్రస్తుతం  ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘డ్యూడ్’. ఇందులో  ప్రదీప్ రంగనాథన్‌‌కు జంటగా మమిత నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘కురళ్‌‌’ పాత్రలో కనిపించనుందని రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్‌‌‌‌లో మమిత బైజూ తన బ్యూటీ అండ్ చార్మ్‌‌తో  ఆకట్టుకుంది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.  సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.