ఇది నిజమేనా : బిచ్చగాడు ఐఫోన్ 15 కొన్నాడా.. గోతాల్లో చిల్లర పైసలు

ఇది నిజమేనా : బిచ్చగాడు ఐఫోన్ 15 కొన్నాడా.. గోతాల్లో చిల్లర పైసలు

స్మార్ట్ ఫోన్ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి ఐఫోన్ కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది.  కానీ  దాని ఖరీదు చూసి  చాలా మంది సామాన్యులు కొనడానికి  వెనుకాడుతుంటారు. సామాన్యులే వెనకాడుతుంటే ఓ బిచ్చగాడు ఐ ఫోన్ కొనగలడా  కలలో కూడా అసాధ్యమే కదా.. పోనీ ఐ ఫోన్ కొంటానని షోరూమ్ కు వెళ్తే అతన్ని కనీసం లోపలికి రానిస్తారా..  అది పోనీ డబ్బు మొత్తం చిల్లరగానే ఇస్తానంటే అందుకు ఒప్పుకుంటారా కష్టం కదా.. 

సరిగ్గా ఇవే ప్రశ్నలతో  ఎక్స్‌పెరిమెంట్ కింగ్ అనే యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకులు ఓ   ప్రయోగాన్ని చెపట్టారు. అందులోని ఓ టీమ్ మెంబర్  బిచ్చగాడిలాగా వేషం కట్టుకుని,  చేతిలో ఓ చిల్లర పైసలతో ఉన్న ఓ సంచిని భుజానికి వేసుకుని వెళ్లాడు. ముందుగా రాజస్థాన్ లోని  జోధ్‌పూర్‌లో కొన్ని మొబైల్‌ షోరూంలు తిరిగాడు.  అతన్ని చాలా మంది లోపలికి కూడా రానివ్వలేదు. 

చివరగా ఓ షాపు యజమాని మాత్రం  చిల్లర తీసుకొని తనకు ఐ ఫోన్‌ ప్రో మ్యాక్స్‌ మోడల్‌ను అందజేశాడు. అయితే  ఇదంతా ప్రాంక్‌ అని, తాను  నిజమైన బిచ్చగాడిని కాదని, చెప్పడంతో ఆ షాపు యజమాని ఆశ్చర్యపోయాడు.  దీనికి సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వైరల్ వీడియో ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది.  

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు.  షాపు యజమానికి కస్టమరే దేవుడు. అందుకే చిల్లర తీసుకొని మరీ ఐ ఫోన్‌ ఇచ్చేశాడని కొంతమంది ,కామెంట్ చేయగా, ఇవన్నీ చాలా ఓల్డ్ బ్రో..  కొత్తగా ఏమైనా ఉంటే ట్రై చేయండంటూ మరికొందరు  సలహా ఇస్తున్నారు.