మూసీలో చిక్కుకున్న వ్యక్తి.. రెండు గంటలు రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు, DRF

మూసీలో చిక్కుకున్న వ్యక్తి.. రెండు గంటలు రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు, DRF

కాచిగూడ, వెలుగు: చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ సమీపంలోని మూసీ నదిలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని కాచిగూడ పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సురక్షితంగా రక్షించారు. సోమవారం సాయంత్రం మూసీ నదిలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడని స్థానికులు కాచిగూడ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నదిలో చిక్కుకున్న వ్యక్తిని గుర్తించారు. చిక్కడపల్లి డివిజన్ ఏసీపీ రణవీర్ రెడ్డి, కాచిగూడ సీఐ రాజశేఖర్ పర్యవేక్షణలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలతో కలిసి పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ అనంతరం ఆ వ్యక్తిని సురక్షితంగా నది వెలుపలికి తీసుకువచ్చారు.

 బాధితుడిని తదుపరి విచారణ కోసం కాచిగూడ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అవసరమైన వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్, సంరక్షణ అందించేందుకు కాచిగూడ పోలీసులు అతన్ని ఓ షెల్టర్ హోమ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు వెల్లడించారు. పోలీసుల సమయస్ఫూర్తి, అప్రమత్తతతో ఒక ప్రాణాన్ని కాపాడగలిగామని అధికారులు పేర్కొన్నారు.