13 పెళ్లిళ్లు చేసుకున్న శివ శంకర్ బాబు అరెస్టు

13 పెళ్లిళ్లు చేసుకున్న శివ శంకర్ బాబు అరెస్టు

నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 13 మంది యువతులను పెళ్లి చేసుకున్న శివ శంకర్..  పెళ్లిళ్లు చేసుకొని వారి దగ్గరి నుంచి డబ్బులు తీసుకొని పారిపోవడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో శివ శంకర్ బాబుపై పోలీసులు ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో శివ శంకర్ బాబును  అరెస్ట్ చేయాలంటూ ఓ బాధిత మహిళ రోడ్డెక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉన్న యువతిని సైతం మోసం చేసిన శివ శంకర్ బాబు... ఆమె దగ్గర్నుంచి 35 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.

విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్..

శివ శంకర్ బాబుపై కొండాపూర్ కి చెందిన ఓ బాధిత తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేసిందని మాదాపూర్ ఏసీపీ రఘునానందన్ రావు తెలిపారు. ఇప్పటికే ఈ  కేసుపై నమోదు చేసి విచారించామన్న ఆయన.. గతంలో ఇతనిపై అనంతపూర్, బాలానగర్, KPHB, RC పురం పీస్ లో కేసులు ఉన్నాయని చెప్పారు. మాట్రిమోని సైట్ లో విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ గా చేసుకొని మోసం చేస్తున్నాడన్నారు. పెళ్లి పేరుతో వల వేసి కొద్దీ రోజులు తిరిగిన తరువాత డబ్బులు, బంగారం తీసుకొని  మోసం చేస్తున్నాడని ఏసీపీ చెప్పారు. ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకున్నట్లు గుర్తించామన్న ఏసీపీ రఘునందన్ రావు... ఇంకా భాదితులు ఉన్నారని తెలుస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అడపా శివ శంకర్ పై మాదాపూర్  పీఎస్ లో చీటింగ్ కేసు నమోదు అయిందని, ఉద్యోగుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు కూడా కేసు నమోదు అయిందని తెలిపారు. నిండితుడు శివ శంకర్ ను వైజాగ్ లో అరెస్ట్ చేశామని... త్వరలోనే శివ శంకర్ ను కస్టడీ లోకి తీసుకొని విచారిస్తామని స్పష్టం చేశారు. ఇంకా భాదితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఏసీపీ రఘునానందన్ రావు తెలిపారు.