మంగళవారం మరింత బోల్డ్గా.. పాయల్ క్యారెక్టర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మంగళవారం మరింత బోల్డ్గా.. పాయల్ క్యారెక్టర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పాయల్​రాజ్పుత్ (Payal Rajput) లేటెస్ట్​ మూవీ ‘మంగళవారం’(Managalavaram) విడుదలకు ముందే మంచి బజ్ను క్రియేట్​చేసుకుంది. ఇందులో ఆర్ఎక్స్​100ని మించి ఈ బ్యూటీ బోల్డ్​ సీన్స్లో నటించినట్టు తెలుస్తోంది. కథ నమ్ముకుని దర్శకుడు అజయ్​భూపతి( Ajay Bhupathi) ఈ మూవీతో ప్రయోగం చేస్తున్నాడు. దీనికి పాయల్​ క్రేజ్​కూడా తోడై టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్​ వస్తోంది. 

తాజాగా ఈ మూవీపై కొత్త రూమర్​బయటకు వచ్చింది. ఇందులో పాయల్​క్యారెక్టర్​నింఫోమానియాక్​అనే కండీషన్​తో బాధపడుతుందట. అంటే అదుపుచేసుకోలేని శృంగార కోరికలు ఉండే యువతిగా పాయల్​కనిపించనుందని టాక్. ఈ వార్తతో మంగళవారం మూవీ ఊహించిన దానికన్నా మరింత బోల్డ్గా ఉండే చాన్స్​ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి క్యారెక్టర్ను స్క్రీన్ పై చూపించాలంటే..డైరెక్టర్,పాయల్ ఎంత ధైర్యం చేసి ముందుకు వెళ్లారో అర్ధం అవుతుంది. 

రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్తో ఆడియన్స్లో ఇంటెన్సిటీ పెంచేశారు డైరెక్టర్ అజయ్ భూపతి. ట్రైలర్లో డైలాగ్స్ ఎక్కువ లేకుండా..కేవలం విజువల్స్ తోనే మెప్పించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా..అనుక్షణం భయపడుతూ బతికే ఊరి ప్రజలు..అందులో మంగళవారం వస్తే చాలు..ఆ ఊర్లో ఒక శవం లేస్తుందనే భయాన్ని పుట్టించేశాడు.  

ఇంతకీ ఆ హత్యలు చేస్తుంది ఎవరు?. అది కూడా మంగళవారమే రాగానే..ఎందుకు హత్యలు చేస్తున్నారు. అలాగే హత్య చేసిన ప్రతిసారి..గోడపైన ఏదో రాసి పెట్టి ఉంచడం..ఇలా ముసుగు వేసుకుని ఊరి ప్రజలను భయపెడుతున్న మనిషి ఎవరు అనే ఎన్నో ప్రశ్నలతో ట్రైలర్‌ నింపేశాడు. మదిలో మెదిలే ప్రశ్నలన్నిటికి సమాధానాలు తెలియాలంటే  ఈ నెల 17 వరకు ఆగాల్సిందే.