
మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న కన్నప్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా రేపు జూన్ 27న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ తన ఎక్స్ వేదికగా టీంకు విషెస్ చెప్పాడు.
ఈ సినిమా కోసం మా నాన్న , ఆయన బృందం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా, నా లిటిల్ చాంప్స్ అరియానా, వివియానా, అవ్రామ్‌లు(విష్ణు కూతుళ్లు) వెండితెరపై మంచి జ్ఞాపకాలను పంచుకోనుండటం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.తనికెళ్ల భరణిగారి జీవితకాల కల జీవం పోసుకుని, శుక్రవారం విడుదలకానుండటం సంతోషంగా ఉంది. మంచి మనుసున్న ప్రభాస్, లెజెండరీ నటులు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా ఇలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్లంతా ఈ సినిమాపట్ల చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి..ఈ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాకు ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి బిగ్ స్టార్స్ నటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో కన్నప్ప తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
All the best to Team #Kannappa!
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025
My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.
Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.
So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx