Manchu Manoj: 28 ఏళ్లకే రెండు జనరేషన్స్ కవర్ చేశావ్

Manchu Manoj: 28 ఏళ్లకే రెండు జనరేషన్స్ కవర్ చేశావ్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma), హీరో తేజ సజ్జ (Teja Sajja) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్ (HanuMan). సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. లార్డ్ హనుమాన్ బ్యాక్డ్రాప్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన మేకర్స్ తో పాటు హీరోస్ తమ మనసులో కలిగిన ఫీలింగ్ ను పంచుకుంటున్నారు.

లేటెస్ట్గా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఈ సినిమా చూసి తన ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాతో నాకు, హనుమాన్ తో మా అబ్బాయి ధైర్యవ్ కి గూజ్ బంప్స్ తెప్పించావు కదా తమ్ముడు తేజ. కిల్లర్ పర్ఫామెన్స్తో,అదిరిపోయే నీ యాక్టింగ్తో ఇరగ్గొట్టేశావు.

28 ఏళ్ళకే రెండు జనరేషన్స్ని కవర్ చేసిన హీరోగా నిలిచావు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి ఒక అమేజింగ్ ఫిలిం వచ్చేసింది. నిన్ను చూస్తే చాలా అంటే చాలా గర్వంగా ఉంది తమ్ముడు ప్రశాంత్ వర్మ..ఇంత మంచి సినిమాలో భాగమైన క్రూ మొత్తానికి కంగ్రాట్స్ అని..పోస్టులో మనోజ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మంచు మనోజ్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చి చాలా రోజులైనా..ఫ్యాన్స్ తన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో మనోజ్ ఈ సారి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం వరుణ్ డైరెక్షన్ లో మంచు మనోజ్ వాట్ ది ఫిష్..మూవీలో నటిస్తున్నారు. 

ప్రస్తుతం హనుమాన్ మూవీ అశేషమైన ప్రేక్షక ఆదరణతో పాటు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లెక్కల్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. స్టార్ హీరోల సినిమాలకు సైతం రాని కలెక్షన్స్ హనుమాన్ సాధిస్తోంది. లెక్కల్లో కొత్త లెక్కలు సెట్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది.