తండ్రి కాబోతున్న మంచు మనోజ్‌ దంపతులు

తండ్రి కాబోతున్న మంచు మనోజ్‌  దంపతులు

 నటుడు మంచు మనోజ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే  స్వయంగా ట్వీట్‌ చేశారు.  తన అత్తయ్య శోభా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ టైమ్ లో అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. దీంతో మనోజ్ దంపతులకు సెలబ్రేటీలతో పాటుగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

మనోజ్‌ - మౌనిక ఎంతోకాలం నుంచి స్నేహితులు. కొన్నేళ్ల క్రితం వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఈ ఏడాది మార్చి నెలలో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.  కాగా మౌనికకు ఇప్పటికే ఆరేళ్ల వయసు కొడుకు కూడా ఉన్నాడు.  ఇక 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.