
కన్నప్ప మూవీ రేపు (జూన్ 27) గ్రాండ్గా రిలీజ్ కానుంది. సుమారు రూ.120 కోట్ల బడ్జెట్తో డా,,మంచు మోహన్ బాబు తెరకెక్కించారు. సినిమా రిలీజ్కు ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలుంది. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ సైతం హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో కన్నప్ప బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నప్ప బడ్జెట్ ఎంత? కన్నప్పకు జరిగిన బిజినెస్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? అనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి. ఆ వివరాలన్నీటిపై ఓ లుక్కేద్దాం.
కన్నప్ప బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్:
మంచు విష్ణు నటిస్తూ, కథ స్క్రీన్ ప్లే అందించిన మూవీ ‘కన్నప్ప’.ఈ మూవీ కోసం విష్ణు పెద్ద సాహసమే చేస్తున్నాడు. తన భుజాలపైనే కన్నప్ప సినిమాను మోస్తు రిలీజ్ వరకు తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యవహారంలోను, ప్రమోషన్స్ పరంగా, డిస్టిబ్యూషన్ పరంగా తానొక్కడే నడిపించాడు. అయితే, ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్స్కు అమ్మకుండా.. డిస్ట్రీబ్యూటర్స్కి ఇవ్వకుండా అన్నీ తానై వెళ్తున్నాడు. కన్నప్ప మూవీ బిజినెస్ చేయకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోను విష్ణు సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు.
ఇపుడు విష్ణు తీసుకున్న రిస్క్ గురించే ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇందులోభాగంగా తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, కేరళలో హీరో మోహన్ లాల్ సొంత డిస్టిబ్యూషన్ ఆశీర్వాద్ పిక్చర్స్, హిందీలో జయంతీలాల్ గడా, కర్ణాటకలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, ఓవర్సీస్‌లో అంటే నార్త్ అమెరికాలో వసారా ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో డీఎంవై క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అసలు ఇలాంటి సాహసం వెనుక.. కన్నప్ప కథ ఉందా? హీరోల బలముందా? లేదా విష్ణు ఓవర్ కాన్ఫిడెన్స్? అనేది రేపు సినిమా రిలీజయ్యాక తెలుస్తోంది.
🌿Hitting Theatres Tomorrow!
— Kannappa The Movie (@kannappamovie) June 26, 2025
An unmatched saga of faith, destiny, and timeless love!
Watch #Kannappa, the man who became immortal through sheer devotion, only in cinemas tomorrow! 🔥
🎟️ Book Now: https://t.co/ODH265UkHo
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#Kannappa27thJune… pic.twitter.com/AoqJmioJBb
కన్నప్ప టార్గెట్:
కన్నప్ప ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు మేకర్స్. ఇండియాలో, తెలుగు వెర్షన్ రూ.16 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, హిందీ వెర్షన్ IMDb ప్రకారం తొలి రోజు రూ.4 కోట్లు, కన్నడ, తమిళ్, మలయాళంలో రూ.1 కోటి రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇకపోతే కన్నప్ప ప్రమోషనల్ ఈవెంట్ల ఖర్చులనీ కలిపి, సుమారుగా రూ.120 కోట్ల బడ్జెట్ అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన కన్నప్ప సినిమాకు తొలిరోజు టాక్ బాగుంటే.. రికార్డు బద్దలుకొట్టే ఛాన్స్ ఉంది. తేడా కొడితే మాత్రం అంతే సంగతి. ఎవ్వరు కాపాడలేరు!