
మంచు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa) మూవీ ట్రైలర్ విడుదలైంది. 2025, జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది మూవీ యూనిట్. ఇందులో భాగంగానే శనివారం (జూన్ 14) కన్నప్ప ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
2.55 నిమిషాల విడిదితో ట్రైలర్‌ను కట్ చేశారు. ఇందులో విష్ణు యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్లరేదు. ఎప్పటిలాగానే తమ యాక్టింగ్‌తో ఇరగదీశారు. ట్రైలర్ విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ట్రైలర్‌తో కన్నప్ప సినిమాపై భారీ హైప్ పెంచేసింది మూవీ యూనిట్.
కాగా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ‘కన్నప్ప’ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, కాజల్, అక్ష య్ కుమార్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. జూన్ 27న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కన్నప్ప చిత్రం విడుదల కానుంది.