
మంచు విష్ణు కన్నప్ప నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. నేడు (జూన్ 10న) కన్నప్ప ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో జూన్ 13న కన్నప్ప ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు మంచు విష్ణు ప్రకటించారు.
13th June!#kannappa #harharmahadevॐ pic.twitter.com/BHcUzqIZZu
— Vishnu Manchu (@iVishnuManchu) June 10, 2025
‘‘విశ్వాసం.. అగ్ని.. ఉగ్రత. జూన్ 13న ఆ దివ్య యోధుడి పిలుపు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. కన్నప్ప ట్రైలర్ ఉరుములతో వస్తుంది. మరెవరికీ లేని భక్తుడి గాథను చూడటానికి సిద్ధంగా ఉండండి. హర్ హర్ మహాదేవ్.. హర్ ఘర్ మహాదేవ్ ’’ అని కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ కోసం మంచు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇపుడీ ట్రైలర్ అప్డేట్తో తమ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
🌪️ Faith. Fire. Fierceness.
— Kannappa The Movie (@kannappamovie) June 10, 2025
The divine warrior’s call will echo across the world on 13th June.
💥 The trailer of Kannappa arrives with thunder.
Get ready to witness the saga of a devotee like no other.
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#Kannappa27thJune #KannappaMovie… pic.twitter.com/U7bXZd5yZQ
జూన్ 27 విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్లో వేగం పెంచారు మేకర్స్. ఇటీవలే పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇలా అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ కన్నప్పను ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా హీరో విష్ణు ఇంటర్వ్యూస్ ఇస్తూ.. ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. త్వరలో ప్రభాస్ సైతం ప్రమోషన్స్ లో భాగం కానున్నారు.
మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 'కన్నప్ప' చిత్రాన్ని రూపొందించారు. కథ, స్క్రీన్ ప్లే విష్ణు అందించగా.. 'మహాభారత' సిరీస్ ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు.
ఈ భక్తి రస ప్రాజెక్ట్లో పలు ఇండస్ట్రీల స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ భాగమయ్యారు. ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తుండగా రుద్రగా ప్రభాస్ కనిపిస్తున్నాడు.