కన్నప్పతో మంచు విష్ణు వారసుడి ఎంట్రీ.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్

కన్నప్పతో మంచు విష్ణు వారసుడి ఎంట్రీ.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్

టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. అందులో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు ఉన్నారు. దీంతో ఈ సినిమాపై ఇండియా వైడ్ గా బజ్ క్రియేట్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కన్నప్ప మూవీ నుండి క్రేజీ అప్డేట్‌ను ఇచ్చాడు మేకర్స్. ఈ ప్రెస్టీజియస్ సినిమాలో మంచు విష్ణు మంచు కుమారుడు అవ్రామ్ ఒక ప్రత్యేకమైన రోల్ లో కనిపించనున్నారట. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో మంచు ఫ్యామిలీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నప్ప లాంటి గొప్ప సినిమా ద్వారా తన కుమారుడు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడంపై మంచు విష్ణు స్పందించారు.

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాకు నా జీవితంలో చాలా ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో నా కొడుకు అవ్రామ్ ప్రత్యేక పాత్రలో నటించడం నాకు చాలా గర్వకారణం. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని ఇస్తుంది. మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం చిత్రమే కాదు.. మూడు తరాల మా కుటుంబం కలయిక.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.