- టైటిల్: మండాడి
- డైరెక్షన్: మథిమారన్
- కాస్ట్: సూరి, సుహాస్, మహిమ నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, బాల శరవణ్
- ప్లాట్‌ఫాం: నెట్‌ఫ్లిక్స్
కళింగపట్నం అనే సముద్ర తీరప్రాంత జాలరుల గ్రామంలో తరతరాలుగా జాతరకు ముందు జరిగే పడవ పందాలలో మండాడి జట్టు ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఈ జట్టుకు మునెయ్య (సత్యరాజ్) దగ్గర మెళకువలు నేర్చుకున్న ప్రాణస్నేహితులు కాళీ (సూరి), పులి (సుహాస్) ప్రాతినిధ్యం వహిస్తుంటారు.
మునెయ్య కూతురు చిలకమ్మ (మహిమా నంబియార్)తో ప్రేమలో ఉన్న కాళీ, కొన్ని అనూహ్య సంఘటనల వల్ల ఊరు వదిలి వెళ్లిపోయి నగరంలో ఉద్యోగం చేస్తూ 20 ఏళ్లు గడుపుతాడు.
మళ్లీ ఊరిలో పడవ పందాలు మొదలైనప్పుడు జరిగిన గొడవల్లో పులి కొడుకు కిశోర్ గాయపడగా, అతనిపై దాడి చేసిన మల్లేశ్ నగరానికి పారిపోయి కాళీ ఆశ్రయం పొందుతాడు. తన కొడుకును గాయపరిచిన మల్లేశ్‌కు కాళీ అండగా నిలిచాడని తెలుసుకున్న పులి వారిద్దరినీ చంపడానికి మనుషులను పంపించగా, వారి బారి నుంచి తప్పించుకున్న కాళీ మల్లేశ్‌ను తీసుకుని సొంత ఊరిలోని పులి ఇంటికే వెళ్తాడు. అసలు కాళీ 20 ఏళ్ల క్రితం ఊరిని, ప్రేయసిని వదిలి ఎందుకు వెళ్లాడు? మల్లేశ్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? పులి ఇంటికి వెళ్లాక ఏం జరిగిందనేదే మిగతా కథ.
