తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ లీడ్ రోల్స్‌లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘మండాడి’. సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన దర్శకులు శివ నిర్వాణ, శైలేష్ కొలను సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
ఈ సినిమా భారీ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నానని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని అన్నారు. సుహాస్ మాట్లాడుతూ ‘అందరి సపోర్ట్‌తో ఎన్నో ఫేజెస్ దాటుకుంటూ ‘మండాడి’ వరకు వచ్చా. ఓ వినూత్న కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని అన్నాడు. సూరి మాట్లాడుతూ .. షూటింగ్‌లో తమకు ఎదురైన ఛాలెంజెస్‌ను ఫన్నీగా చెబుతూ తన స్టైల్‌లో నవ్వులు పూయించాడు.
ఇది తనకు చాలా స్పెషల్ మూవీ అని హీరోయిన్ మహిమా నంబియార్ చెప్పింది. ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని డైరెక్టర్ మతిమారన్ అన్నాడు. తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి నిర్మాతలకు ఎల్రెడ్ కుమార్ థ్యాంక్స్ చెప్పారు. నటులు రవీంద్ర విజయ్, లిరిసిస్ట్ భాస్కర్ భట్ల సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
