కమెడియన్‌గా ఆకట్టుకున్న తమిళ నటుడు సూరి.. విడుదలై, గరుడన్, మామన్ లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పిస్తున్నాడు. తను లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘మండాడి’. తెలుగు నటుడు సుహాస్ ఇందులో విలన్‌గా నటించాడు. బుధవారం ఈ మూవీ తెలుగు వెర్షన్ టీజర్‌ను విడుదల చేశారు. తమిళనాడులోని తీర ప్రాంతాల్లో జరిగే సాంప్రదాయ బోట్ రేస్‌ల నేపథ్యంలో దీన్ని తెరకెక్కించారు.
‘పందెమే మనల్ని కాపాడుతుంది.. పందాన్ని మనం కాపాడటం లేదు.. బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు..” లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సూరి, సుహాస్ పాత్రల పరిచయం, సముద్రం నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి.
జీవీ ప్రకాష్ బీజీఎం ఇంప్రెస్ చేసింది. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషించారు. మతిమారన్ ఈ చిత్రానికి పుగళేంది దర్శకుడు. ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. సెప్టెంబర్ 10న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. మైత్రి సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.
