OTTకి వచ్చేస్తున్న మంగళవారం.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

OTTకి వచ్చేస్తున్న మంగళవారం.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

RX100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaaram). డైనమిక్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి(Ajay Bupathi) ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. 

ఇక తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో.. మంగళవారం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న  మంగళవారం ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరో థియేటర్ లో హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం సినిమాకు ఓటీటీలో ఎలాంటి రేపన్స్ వస్తుందో చూడాలి.