Mangalavaaram JIFF 2024: డైరెక్టర్ చెప్పిందే నిజమైంది..మంగళవారంకు నాలుగు అవార్డులు

Mangalavaaram JIFF 2024: డైరెక్టర్ చెప్పిందే నిజమైంది..మంగళవారంకు నాలుగు అవార్డులు

RX100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaaram). డైనమిక్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి(Ajay Bupathi) ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది కూడా. ఓటీటీలోను అదే హవా కొనసాగించింది.

లేటెస్ట్గా మంగళవారం సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వరించాయి. జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులని గెలుచుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్ ఫంక్షన్స్లో డైరెక్టర్ అజయ్ భూపతి..ఏదైతే చెప్పాడో కరెక్ట్గా అదే జరిగింది.

ఈవెంట్లో అజయ్ భూపతి మాట్లాడుతూ..మంగళవారం సినిమా ఒక స్క్రీన్ ప్లే విజువల్ అని..ఇదొక టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను..సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవడమే కాదు..అవార్డ్స్ కూడా వస్తాయని చెప్పాడు.అజయ్ అనుకున్నట్టుగానే చెప్పింది నిజం చేస్తూ..ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో(JIFF 2024) 4 అవార్డులని మంగళవారం మూవీ సొంతం చేసుకుంది. అవార్డ్స్ వివరాలు చుస్తే.. 

1. ఉత్తమ నటిగా – పాయల్ రాజపుత్
2. ఉత్తమ సౌండ్ డిజైన్ – రాజా కృష్ణన్
3. ఉత్తమ ఎడిటింగ్ – గుళ్ళపల్లి మాధవ్ కుమార్
4. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – ముదసర్ మొహమ్మద్

ఇదే విషయాన్నిమేకర్స్ ట్వీట్ చేస్తూ.. స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా ‘మంగళవారం’ సినిమా..ఇప్పటికే సినీ ఇండస్ట్రీ దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకోగా..ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే..' అని తమ ఆనందం వ్యక్తం చేసారు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్.