‘దోస్త్ మేరా దోస్త్’ అంటున్న ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్.. బీచ్లో జంటగా ఫొటో షూట్.. ఫొటోలు వైరల్

‘దోస్త్ మేరా దోస్త్’ అంటున్న ఎలాన్  మస్క్, జుకర్ బర్గ్.. బీచ్లో జంటగా ఫొటో షూట్.. ఫొటోలు వైరల్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, మెటా అధినేత జుకర్ బర్గ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం మనందరికి తెలిసిందే.. కేజ్ ఫైట్ పుకార్లనుంచి జుకర్ బర్గ్ థ్రెడ్స్ లాంచింగ్ వరకు ప్రతి అంశంలో వారిద్దరు సోషల్ మీడియా వేదికగా మేసేజ్, మీమ్స్ తో ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ , జుకర్ బర్గ్లపై ట్విట్టర్ లో ఓ పోస్ట్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ బిలియనీర్లద్దిరిపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI )తో రూపొందించిన కొల్లేజ్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో అటువైపు ఓ లుక్ వేద్దాం.. 

ఈ ఫొటోలలో ఇద్దరు బిలియనీర్లు జీన్ ప్యాంట్లు, సాలిడ్ టీషర్ట్ లను ధరించి కనిపించారు. ఒక ఫొటోలో ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ కౌగలించుకొని కనిపించగా.. మరో ఫొటోలో ఒకరి చేయి ఒకరు పట్టుకొని బీచ్ లో పరుగెడుతున్నట్లు కనిపిస్తుంది. వీటిని సర్ డొగే ఆఫ్ ది కాయిన్ పేరుతో ఓ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మస్క్, జుకర్ బర్గ్ పై ఇదివరకు కూడా చాలా చిత్రాల్ని రూపొందించారు క్రియేటర్లు.  కేజ్ ఫైట్ రూమర్ల నేపథ్యంలో ఎలాన్ మస్క్ కరాటేలో శిక్షణ తీసుకుంటున్నాట్లు ఫొటోలో గతంలో వైరల్ అయ్యాయి. మొదటి కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ లెక్స్ ఫ్రిడ్ మాన్ దగ్గర  టెస్లా అధినేత శిక్షణ తీసుకుంటున్నట్లు ఆ ఫొటోల్లో కనిపించింది. 

 

కాగా.. మెటా అధినేత జుకర్ బర్గ్ ఎప్పుడైతే ట్విట్టర్ కు పోటీగా టెక్ట్ ఆధారిత సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ను ప్రారంభించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ట్విట్టర్ లో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో జుకర్ బర్గ్ పై ఎలాన్ మస్క్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో  ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంపై నెటిజన్లు ఎంజాయ్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.