
కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసిన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘టీజర్ చాలా ఫన్నీగా ఉంది. పార్వతీశం కామెడీ టైమింగ్ బాగుంటుంది. టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అంటూ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఇక టీజర్ విషయానికొస్తే.. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకునే పార్వతీశంకు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే చాలా ఇష్టం.
తన తల్లితో గొడవపడ్డ కూరగాయలు అమ్మే మహాలక్ష్మిలో ఆ క్వాలిటీస్ కనిపించి ఐ లవ్ యు చెబుతాడు. ఆమెతో పాటు అతని తల్లి కూడా చెంప ఛెళ్లుమనిపిస్తారు. ‘మార్కెట్ మహాలక్ష్మితో మజాక్‌లు ఆడితే మంచిగా ఉండదు’ అని ప్రణీకాన్వికా ఇచ్చిన మాస్ వార్నింగ్ తర్వాత పార్వతీశం ఏం చేశాడనేది మిగతా కథ. తాగుబోతు పాత్రలో మహబూబ్ బాషా, హీరో ఫ్రెండ్‌గా ముక్కు అవినాష్ ఇతర పాత్రల్లో కనిపించారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామన్నారు.