లేడీ కండక్టర్లకు మెరూన్‌ యాప్రాన్

లేడీ కండక్టర్లకు మెరూన్‌ యాప్రాన్

హైదరాబాద్‌, వెలుగు : ఆర్టీసీలోని లేడీ కండక్టర్లకు మెరూన్‌ కలర్‌ యాప్రాన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇటీవల ప్రగతి భవన్‌లో కార్మికులతో జరిగిన మీటింగ్‌లో సీఎం డ్రెస్​కోడ్​మార్చుకోవాలని సూచించారు.  దీంతో ఇందుకోసం అధికారులు కమిటీ వేశారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు లేడీ కండక్టర్లను ఇందులో చేర్చారు.

వారి అభిప్రాయాలు తీసుకొని మెరూన్​కలర్​ యాప్రాన్‌ ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలోని లేడీ కండక్టర్లందరికీ కలిపి 9వేల మీటర్ల క్లాత్​అవసరం కానుంది.