
కుజుడు సింహ రాశిలో ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి మహాయోగం పట్టబోతోంది. కుజుడు ఈ రాశిలోకి జూన్ 7న తెల్లవారుజామున 2:10 గంటల నుంచి ఆగస్టు 18 వరకు సంచరించడం జరుగుతుంది. ఈ కాలంలో ఐదు రాశుల వారు ఊహించని ప్రయోజనాలను పొందుతార. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. . .
మేషరాశి :మేషరాశి ఐదో ఇంట కుజుడు సంచరించనున్నాడు. దీనివలన వీరు ఈ కాలంలో టీమ్ లీడర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే రాశిలో ఉన్న కేతువుతో కుజుడు కలవడం వలన కొద్దిగా అశాంతికలుగుతుంది. . విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను కాపాడుకునేందుకు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా సానుకూలంగా ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు చేకూరుతాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడంతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు.
సింహ రాశి : ఈ రాశిలో ఇప్పటికే ఉన్న కేతువుతో కుజుడు కలవడం వలన సింహ రాశికి అన్ని అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుజుడు సంకల్ప శక్తిని పెంచడం వలన ...ఏపని చేపట్టినా విజయం సాధిస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు సునాయాశంగా పూర్తవుతాయి. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోకుండా కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టేందుకు అనుకూల సమయం. ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సానుకూలంగా సాగిపోతుంది. ఎలాంటి ఆందోళన పడకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి.
Also Read : చెట్లు.. పొదలు ఆక్రమించి ఇళ్లు కడితే ఏమవుతుందో తెలుసా..!
వృశ్చిక రాశి: కుజుడు సింహరాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. వీరికి సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అలాగే కొంతమంది స్నేహితులతో కలిసి ఈ సమయంలో మంచి పనులు ప్రారంభిస్తారు. దీనివల్ల శుభవార్తలు కూడా వింటారు. కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సమయం చాలా మంచిది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలొస్తాయి. ప్రేమ.. పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి : కుజుడు సింహరాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అయితే ఆహార విషయంలో నియమాలు పాటించడం అవసరమని పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు.. బంధువులు మోసగించే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి.
మీన రాశి : సింహరాశిలో కుజ సంచారంతో ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు.కష్టపడి పూర్తి ప్రయోజనం పొందుతారు.ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.గౌరవం పెరుగుతుంది. ఓర్పు, ధైర్యంతో పెద్ద సవాళ్లను అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాఫీగా కొనసాగుతుంది.