మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్యూయెల్ ట్యాంకర్ను ఢీకొట్టిన రైలు

మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్యూయెల్ ట్యాంకర్ను ఢీకొట్టిన రైలు

సెంట్రల్ మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకర్ను రైలు ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో నుంచే రైలు వెళ్లింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించగా.. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

‘‘అగ్వాస్కాలియెంటెన్ నగరంలోని రైలు మార్గం వద్ద ఇంధన్ ట్యాంకర్ ట్రాక్ దాటుతుండగా.. రైలు ఢీకొట్టింది. ప్రమాదంతో సమీపంలోని నివాస ప్రాంతాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో సుమారు 1000మందిని అక్కడి నుంచి తరలించాం’’ అని అగ్వాస్కాలియెంటెన్ ఫైర్ చీఫ్ మిగ్యుల్ మురిల్లో తెలిపారు.