
అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం అంటే ఆ ఫ్లాట్ వరకు.. లేదా పక్కనే ఉన్న ప్లాట్ వరకు డ్యామేజ్ అవుతుంది.. మంటలు వ్యాపిస్తాయి.. ఇక్కడ మాత్రం భిన్నంగా.. ఊహించని విధంగా అగ్నిప్రమాదం జరగటం.. వ్యాపించటం విశేషం.. హైరైజ్ అపార్ట్ మెంట్.. ఏడో అంతస్తులో మొదలైన మంటలు.. పైకి వ్యాపించటం.. అది కూడా నిలువునా కాలిపోతున్న విజువల్స్.. భయానకంగా ఉన్నాయి. ముంబైలో ధనవంతులు నివాసం ఉండే.. మెగా గేటెడ్ కమ్యూనిటీలోని.. హైరైజ్ టవర్స్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదం పూర్తి వివరాలు చూద్దాం...
DOMBIVALI | आज दिनांक १३/०१/२०२४ रोजी १३:२३ वाजताच्या सुमारास पलावा फेज २, खोणी, डोंबिवली (पू.) येथे टाटा ओरोलिया बिल्डिंगच्या डक्ट मध्ये आग लागली होती. सदर घटनास्थळी अग्निशमन दलाचे जवान ०२-फायर वाहनासह उपस्थित होते. सदर घटनास्थळी लागलेली आग १४:३० वाजताच्या सुमारास पूर्णपणे… pic.twitter.com/yNP4GtToJM
— ℝ?? ???? (@Rajmajiofficial) January 13, 2024
ముంబైలోని డోంబివిలీలో భారీ అగ్ని ప్రమాదం శనివారం జరిగింది.ఖోలి ప్రాంతంలోని పలావా టౌన్ షిప్ నూతన భవనం ఏడో అంతస్తు లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 18 అంతస్తుల భవనంలో మూడవ అంతస్తు వరకు నివాసితులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.