మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్నంటిన నల్లని పొగలు

మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్నంటిన నల్లని పొగలు

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. కాగా ఘటనా స్థలంలో మంటల ధాటికి ఏర్పడిన నల్లటి పొగ.. ఆకాశాన్నంటేలా అక్కడి వాతావరణమంతా వ్యాపించింది.

జహంగీర్‌పురి ప్రాంతంలోని మురికివాడల్లో అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అసిస్టెంట్ డివిజనల్ అధికారి రాజీవ్ కుమార్ సిన్హా వెల్లడించారు. తాము వెంటనే స్పందించి 11,12 అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నామని చెప్పారు. చెత్త పడి ఉన్న బహిరంగ ప్రదేశంలో మంటలు చెలరేగినట్లు గుర్తించామన్న ఆయన.. ప్రస్తుతం మంటలు ఆర్పివేస్తున్నామని తెలిపారు. ఈ మంటలు ఆర్పేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారి చెప్పారు.

https://twitter.com/ANI/status/1665238972065550336