జీహెచ్ఎంసీలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు.. పలువురికి ప్రమోషన్లు

జీహెచ్ఎంసీలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు.. పలువురికి ప్రమోషన్లు

బల్దియాలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు  జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం, కొందరు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కడం తదితర కారణాలతో అధికారులను బదీలీ చేశారు. శనివారం (జూన్ 21) బల్దియా పరిధిలో 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పలువురు  టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీతో పాటు కొందరు సెక్షన్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు బల్దియా కమిషనర్. ఇటీవల పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డటం.. ప్రజావాణి లో ఎక్కువగా టౌన్ ప్లానింగ్ పైనే ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 

బల్దియాలో ఖాళీల భర్తీ చేయాలని ఇటీవలే నిర్ణయించారు. అందులో భాగంగా ఉద్యోగుల భర్తీతో పాటు పలువురు అధికారుల పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టారు. సెక్షన్ ఆఫీసర్లు గా ఉన్న పలువురికి ఏసీపీలు గా ప్రమోషన్స్ ఇచ్చారు. 

వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన ఏడుగురు అధికారులకు సర్కిల్ ACP లుగా పోస్టింగ్ లు ఇచ్చారు. అధికారులకు వ్యక్తిగతంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్  ఇచ్చారు కమిషనర్ ఆర్వీ కర్ణన్.

ఎవరెవరు ఏ ఏరియాకు..

మొత్తం13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, 14 మంది సెక్షన్ ఆఫీసర్లలను బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..

  • మెహిదీపట్నం సర్కిల్ ACP గా ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్ సర్కిల్ కి బదిలీ
  • గాజుల రామారం ACP గా సుమిత్ర కు పోస్టింగ్
  • అల్వాల్ ACP గా శ్రీనివాస్ రెడ్డి పోస్టింగ్
  • కార్వాన్ నుంచి సికింద్రాబాద్ acp గా పావని బదిలీ
  •  హయత్ నగర్ acp గా విజయలక్ష్మి కి పోస్టింగ్
  • హెడ్ ఆఫీస్ లో ACP గా నరేష్ కి పోస్టింగ్
  • సుధాకర్ కి సెక్షన్ ఆఫీసర్ నుండి ACP గా ప్రమోట్ చేస్తూ చంద్రయాన్ గుట్ట లో పోస్టింగ్
  • కూకట్పల్లి ACP గా ఉన్న రమేష్ కుమార్ గోషామహల్ కి బదిలీ
  • తాండూరు నుండి లాలప్ప ACP గా శేరిలింగంపల్లి జోనల్ కి బదిలీ
  • సెక్షన్ ఆఫీసర్ నుండి జీషన్ ను ACP గా ప్రమోట్ చేస్తూ కూకట్ పల్లి acp గా పోస్టింగ్..
  • భానుచందర్ చంద్రయాన్ గుట్ట acp ను సంతోష్ నగర్ acp గా బదిలీ..
  •  గోషామహల్ ఏసీపీ మంజుల సింగ్ కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ acp గా బదిలీ..
  • సంతోష్ నగర్ ఏసీపీ, స్వామి మెహేదీపట్నం బదిలీ..
  • రమేష్ సెక్షన్ ఆఫీసర్ కుత్బుల్లాపూర్ నుండి చందానగర్ బదిలీ..
  • MD అగ్బర్ అహ్మద్ సెక్షన్ ఆఫీసర్, హయత్ నగర్ నుండి శేరిలింగంపల్లి బదిలీ..
  • SK సురేష్ కుమార్ సెక్షన్ ఆఫీస,ర్ ఉప్పల్ నుండి జూబ్లీ హిల్స్ కు బదిలీ..
  • మహేందర్ సెక్షన్ ఆఫీసర్, ఫలక్నుమా నుండి ఘోషమహల్ కు బదిలీ..
  • JK నరేష్ సెక్షన్ ఆఫీసర్, గోషామహల్ నుండి చార్మినార్ కు బదిలీ..
  • సోమేశ్వర్, కూకట్ పల్లి నుండి హయత్ నగర్ సర్కిల్ కు బదిలీ..
  • తుల్జాసింగ్ సెక్షన్ ఆఫీసర్, గాజులరామారం నుంచి ఉప్పల్ సర్కిల్ కి బదిలీ..
  • నరేష్ సెక్షన్ ఆఫీసర్, యూసఫ్ గూడా నుంచి ఫలక్నుమా కి బదిలీ..
  • మధు సెక్షన్ ఆఫీసర్, పటాన్ చెరు నుండి కూకట్ పల్లి బదిలీ..
  • BV ప్రకాష్ సెక్షన్ ఆఫీసర్, కార్వాన్ నుండి మెహిదీపట్నం కు బదిలీ..
  • రోహన్ ఠాకూర్ సెషన్ ఆఫీసర్ చందానగర్ పోస్టింగ్..
  • రామచందర్ సెక్షన్ ఆఫీసర్ ,సరూర్ నగర్ నుంచి ఫలక్ నుమా కు బదిలీ..
  • ముకేష్ సింగ్ సెక్షన్ ఆఫీసర్, చార్మినార్ నుండి గాజుల రామారం..