అభినవ్‌‌‌‌‌‌‌‌లో మస్త్​ షేడ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి : నిఖిల్​

అభినవ్‌‌‌‌‌‌‌‌లో మస్త్​ షేడ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి : నిఖిల్​

క‌‌‌‌‌‌‌‌మెడియ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌గా త‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌కంటూ ఓ మార్క్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేసుకున్న  అభిన‌‌‌‌‌‌‌‌వ్ గోమ‌‌‌‌‌‌‌‌ఠం(Abhinav Gomatam) హీరోగా నటించిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా(Masth Shades Unnai Ra).  తిరుప‌‌‌‌‌‌‌‌తి రావు ఇండ్ల(Thirupathi Rao Indla) ద‌‌‌‌‌‌‌‌ర్శక‌‌‌‌‌‌‌‌త్వంలో భ‌‌‌‌‌‌‌‌వాని కాసుల‌‌‌‌‌‌‌‌(Bhavani Kasula), ఆరెమ్ రెడ్డి(Arem Reddy), ప్రశాంత్‌‌‌‌‌‌‌‌.వి(Prashanth.V) ఈ చిత్రాన్ని నిర్మించారు. వైశాలి రాజ్(Vaishali Raj) హీరోయిన్‌‌‌‌‌‌‌‌. ఫిబ్రవరి 23న సినిమా విడుదల  కానుంది.  శనివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హీరో నిఖిల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ  ‘‘ఈ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రానికి ఏమైంది’ సినిమా చూసిన త‌‌‌‌‌‌‌‌రువాత అంద‌‌‌‌‌‌‌‌రూ అభిన‌‌‌‌‌‌‌‌వ్ లాంటి ఫ్రెండ్ కావాల‌‌‌‌‌‌‌‌ని అనుకుంటారు.

సెట్‌‌‌‌‌‌‌‌లో అంద‌‌‌‌‌‌‌‌ర్ని న‌‌‌‌‌‌‌‌వ్విస్తుంటారు. తనలో చాలా షేడ్స్ ఉన్నాయి. అభినవ్‌‌‌‌‌‌‌‌కు ఈ చిత్రం హీరోగా మంచి బిగినింగ్‌‌‌‌‌‌‌‌ను అందించాల‌‌‌‌‌‌‌‌ని సినిమా పెద్ద హిట్ అవ్వాల‌‌‌‌‌‌‌‌ని ఆశిస్తున్నా’ అని చెప్పాడు. అభినవ్ గోమఠం మాట్లాడుతూ ‘నా లైఫ్‌‌‌‌‌‌‌‌లో స్పెష‌‌‌‌‌‌‌‌ల్ మూమెంట్ ఇది. హీరోగా నాకు చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమాలో పాత్రలన్నీ ఎంతో స‌‌‌‌‌‌‌‌హజంగా ఉంటాయి’ అని చెప్పాడు.  ఫ్యామిలీతో చూడదగ్గ ఈ చిత్రం తప్పకుండా  అందరికీ నచ్చుతుంది అని దర్శక నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.